వాషింగ్టన్: అమెరికాలో రోగనిర్ధారణలో జరుగుతున్న చిన్నచిన్న పొరపాట్లకు ఏటా 3.71 లక్షల మంది బలైపోతున్నారు. జాన్హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అంతేకాదు, 4.24 లక్షల మంది అంధత్వం, మెదడు దెబ్బతినడం, కేన్సర్ వంటి వాటి బారినపడి శాశ్వత రోగగ్రస్థులుగా మారుతున్నారని అధ్యయనం తేల్చిచెప్పింది. రోగనిర్ధారణలో ఎక్కువగా సెప్సిస్ (రక్తంలో ఇన్ఫెక్షన్), స్ట్రోక్, న్యుమోనియా, త్రాంబోఎంబోలిజం (సిరల్లో రక్తం గడ్డకట్టం), లంగ్ క్యాన్సర్ వంటి వాటిలోనే ఎక్కువగా రోగనిర్ధారణలో పొరపాట్లు జరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. అయితే, రోగులు భయపడిపోవాల్సిన పనిలేదని, ఆరోగ్య వ్యవస్థపై విశ్వాసం కోల్పోవద్దని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ డేవిడ్ న్యూమాన్ టోకెర్ తెలిపారు.