సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 15:10:38

చైనాలో రెస్టారెంట్ కూలి.. 29 మంది మృతి

చైనాలో రెస్టారెంట్ కూలి.. 29 మంది మృతి

బీజింగ్: చైనాలో రెస్టారెంట్ కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 29కి చేరింది. మరో 28 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మొత్తం 57 మంది సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. బీజింగ్‌కు 630 కిలోమీటర్ల దూరంలోని షాంకి ప్రావిన్స్‌లోని జియాంగ్‌ఫెన్ కౌంటీలో గల రెండంతస్తుల రెస్టారెంట్‌లో ఒక వ్యక్తి 80వ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా శనివారం అది కూలిపోయింది. వెంటనే వందలాది మంది రెస్క్యూ సిబ్బంది, డాగ్స్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించారు. ఆదివారం నాటికి రెస్క్యూ ఆపరేషన్ ముగించారు. మొత్తం 29 మంది చనిపోగా 28 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. ఈ రెస్టారెంట్ ఎలా కూలిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు గనులున్న ఈ ప్రాంతంలో గతంలో పేలుళ్లు, వరదలు, గనులు కూలిన ఘటనల్లో వేలాది మంది మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo