Fake Aadhaar cards: కేరళలో 50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు
Fake Aadhaar cards: కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌కు చెందిన 50 వేల మంది శరణార్థులు నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ తన రిపోర్టులో పేర్కొన్నది. అస్సాం, బెంగాల్, కేరళలోని ఆధార్ కేంద్రాల్లో నకిలీ కార్డులను సృష్టిస్తున్నట్లు రిపోర్టులో తెలిపారు.
కొచ్చి: కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌కు చెందిన 50 వేల మంది శరణార్థులు నకిలీ ఆధార్ కార్డు (Fake Aadhaar cards)కలిగి ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ తన రిపోర్టులో పేర్కొన్నది. అస్సాం, బెంగాల్, కేరళలోని ఆధార్ కేంద్రాల్లో నకిలీ కార్డులను సృష్టిస్తున్నట్లు రిపోర్టులో తెలిపారు. దేశంలో నివాసం ఏర్పుచుకునేందుకు శరణార్థులు నకిలీ ఆధార్ కార్డులను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మిలిటెరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బోర్డర్ సెక్యూర్టీ దళం తన నిఘాను పెంచింది. సరిహద్దు రాష్ట్రాల్లోనే నిఘాను పెంచేశారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోనూ ఇండియన్ కోస్టు గార్డులు నిఘాను పెంచారు. విదేశీయులు అక్రమంగా కేరళలోకి చొరబడుతున్నట్లు ఏడాది క్రితమే కేంద్ర నిఘా ఏజెన్సీలు వెల్లడించాయి. మల్లపురంలో ఉన్న ఆధార్ కేంద్రంలోకి అక్రమంగా చొరబడి 50 ఆధార్ కార్డులను తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగాల్, జార్ఖండ్ నుంచి ఐపీ అడ్రెస్‌లతో కేరళలో ఆధార్ కేంద్రాలను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. కేరళ పోలీసులు ఇవాళ వందల సంఖ్యలో నకిలీ ఆధారు కార్డులను సీజ్ చేశారు. ఆధార్ చట్టం ప్రకారం నకిలీ కార్డు కలిగిన వారికి మూడేళ్ల జైలు లేదా లక్ష జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

