బీజింగ్: చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వీఝౌ ప్రావిన్స్‌లోని సందూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. దీంతో 27 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని స్థానిక అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సంధూ ప్రావిన్స్ రాజధాని గ్వియాంగ్‌కు 170 కిలోమీటర్ల దూరంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 47 మంది ఉన్నారని చెప్పారు.
దేశంలోని ఛాంగ్సూ నగరంలో ఉన్న 42 అంతస్తుల బిల్డింగ్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాద ధాటికి బిల్డింగ్‌లోని అన్ని ఫ్లోర్లు తగలబడిపోయాయి. దీంతో ఆప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు. రెండు గంటల్లోనే మంటలను అదుపుచేశామన్నారు.