సియోల్: దక్షిణి కొరియాలోని దక్షిణ ప్రాంతాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. 200కుపైగా నిర్మాణాలు ధ్వంసం కాగా, 24 మంది మృతి చెందారు. 27వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కార్చిచ్చు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యూసియాంగ్ ఒకటి. ఇక్కడి మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఓ హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ మృతి చెందారు.