టాస్మానియా: ఆస్ట్రేలియాలోని పశ్చిమ తీరం టాస్మానియా బీచ్లో సుమారు 230 తమింగళాలు చిక్కుకున్నాయి. అయితే ఆ మందలో ఎక్కువగా పైలట్ వేల్స్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న తిమింగలాలను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు బయలుదేరాయి.
మాక్వెయిర్ హార్బర్ సమీపంలో తిమింగలాలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. రెండేళ్ల క్రితం కూడా ఇక్కడే పెద్ద సంఖ్యలో వేల్స్ స్తంభించిపోయాయి. బాస్ సంధి వద్ద ఉన్న కింగ్ ఐలాండ్లో మంగళవారం సుమారు 14 యంగ్ స్పెర్మ్ వేల్స్ మృత్యువాతపడ్డాయి. తిమింగలాల వద్దకు చేరుకున్న స్థానికులు వాటిపై బకెట్లతో నీళ్లు చల్లుతూ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.