బుధవారం 20 జనవరి 2021
International - Dec 21, 2020 , 23:44:14

వైరస్‌ స్ట్రెయిన్‌‌.. కరోనా 2 కావచ్చునన్న నెతన్యాహు

వైరస్‌ స్ట్రెయిన్‌‌.. కరోనా 2 కావచ్చునన్న నెతన్యాహు

జెరూసలేం: బ్రిటన్‌లో కరోనా న్యూ వైరస్‌ స్టెయిన్ వెలుగు చూడటంతో ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశీ విమాన ప్రయాణికుల రాకను నిరోధించేందుకు విమానాలను విమానాశ్రయాలకు పరిమితం చేయనున్నది. కరోనా వైరస్‌ ఎక్కువ మందికి సోకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సోమవారం తెలిపారు. 

‘న్యూ మహమ్మారి వ్యాపిస్తున్నదని మేం తెలుసుకున్నాం. ఇది ఏమిటో నిజంగా మాకు తెలియదు. ఇది కరోనా వైరస్‌ 2 కావచ్చునని జెరూసలేంలో జరిగిన మొక్కల ప్లాంటేషన్‌ కార్యక్రమంలో చెప్పారు. బ్రిటన్‌, డెన్మార్క్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో న్యూ కరోనా వైరస్‌ను కనుగొనడంతో బ్రిటన్‌ నుంచి విదేశీయుల రాకపై ఇజ్రాయెల్‌ నిషేధం విధిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నది. 

దౌత్యవేత్తల వంటి వారికి మినహాయింపులు తప్ప విదేశాల నుంచి ప్రయాణికులను అనుమతించబోమని నెతన్యాహు చెప్పారు. ఇంతకు మించి వివరాలను నెతన్యాహు వెల్లడించలేదు. ప్రస్తుతం పది రోజుల వరకు విమానాశ్రయాల మూసివేత నిర్ణయం అమలులో ఉంటుందని, తర్వాత పరిస్థితులను బట్టి పొడిగిస్తామని అన్నారు. ఇది కఠిన నిర్ణయం అని తనకు తెలుసునని, కానీ దీనికి మించిన మార్గం మరొకటి లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo