శనివారం 06 జూన్ 2020
International - Apr 21, 2020 , 10:25:55

మసాచుసెట్స్ను కమ్మేసిన కరోనా

మసాచుసెట్స్ను కమ్మేసిన కరోనా

కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాలో కొత్త ప్రాంతాలను కమ్మేస్తున్నది. న్యూయార్క్‌లో ఇంతకాలం గజగజలాడించిన ఈ వైరస్‌ తాజాగా మసాచుసెట్స్‌ రాష్ట్రాన్ని తాకింది. ఈ రాష్ట్రంలో ఒక్క వారంలోనే 2000 మంది మరణించారు. మరోవారం పాటు ఇక్కడ అత్యంత కఠిన పరిస్థితులు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో హాస్పిటల్స్‌ పెంచుతున్నారు. వైద్యసిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. బోస్టన్‌ ప్రాంతంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ తెలిపారు. మసాచుసెట్స్‌లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని కరోనాపై ఫెడరల్‌ ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్‌ సమన్యకర్త డెబోరా బిర్స్క్‌ వెల్లడించారు. 


logo