అబుజా : నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. దేశ సరిహద్దులో జిహాదీ రెబల్స్‌ను టార్గెట్ చేస్తూ నైజీరియన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడులకు పాల్పడగా, ఇది ‘మిస్‌ఫైర్’ అయ్యింది. పొరపాటున యోబ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో మార్కెట్‌పై వైమానిక దళాలు దాడులు చేశాయి. ఈ ఘటనలో దాదాపు 200 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్టు హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. జిహాదీ గ్రూప్‌లను టార్గెట్ చేయబోయి.. పొరపాటున మార్కెట్‌పై వైమానిక దళం దాడులు చేసినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. మృతిచెందిన వారి సంఖ్య 200కి చేరిందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. దశాబ్దానికిపైగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న జిహాదీ తిరుగుబాటుదారులకు కేంద్రంగా ఉన్న బోర్నో రా్రష్ట్రం పక్కనే ఈ గ్రామం ఉంది.