లండన్: కృత్రిమ మేధతో వచ్చే ఐదేండ్లలో 20 శాతం ఉద్యోగాలు మాయమవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చాట్‌జీపీటీ వివిధ రంగాల్లోని ఉద్యోగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. చాట్‌జీపీటీ కవితలు,స్క్రీన్ ప్లేలు రాయగలదు, పరీక్షలు నిర్వహించగలదు. మొత్తం సంభాషణ జరిపి సూచనలు ఇవ్వగలదు. ఈ నేపథ్యంలో ఇది కస్టమర్ సర్వీస్, కాపీ రైటింగ్, న్యాయ సేవల ఉద్యోగాలను లాగేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ‘20 శాతం ఉద్యోగుల స్థానాన్ని చాట్‌జీపీటీ యథాతథంగా భర్తీ చేయగలదని నేను నమ్ముతున్నాను’ అని అల్టిమా కంపెనీకి చెందిన రిచర్డ్ డెవెరె అనే ఏఐ నిపుణుడు వెల్లడించారు.