సియోల్: దక్షిణ కొరియాలో వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పైలట్లు మరణించగా, మరొకరు గాయపడ్డారు. అవి రెండు కేటీ-1 రకానికి చెందిన విమానాలని, పైలెట్ల శిక్షణ సమయంలో విమానాలు గాలిలో ఢీకొన్నాయని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. అవి ఢీకొన్న తర్వాత ఆగ్నేయ నగరమైన సచియోన్ పర్వతంపై కూలిపోయాయని చెప్పారు. ఈ ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో (దక్షిణ కొరియా కాలమానం ప్రకారం) జరిగిందన్నారు. ప్రమాద స్థలంలో మూడు హెలికాప్టర్లు, అత్యవసర సిబ్బంది గాలిస్తున్నారని వెల్లడించారు.