Road Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
Road Accident | నేపాల్‌లోని దంగ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా, మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు.
Road Accident | ఖాట్మండు : నేపాల్‌లోని దంగ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా, మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు.
ఓ ప్రయివేటు బస్సు నేపాల్‌గంజ్‌లోని బంకే నుంచి ఖాట్మండుకు ప్రయాణికులతో బయల్దేరింది. రాప్తి నది మీదుగా వెళ్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎనిమిది మందిని గుర్తించామని, మరో నలుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ఈ ప్రమాదంలో మరో 22 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు భారతీయుల్లో ఒకరు యూపీకి చెందిన మునే(31), బీహార్‌కు చెందిన యోగేంద్ర రామ్(67) ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను లమాహి ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

