Watch: ఇంజిన్లు ఫెయిల్, హైవేపై కూలిన విమానం.. వీడియో వైరల్
Plane Crash | విమానం ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించాడు. అయితే హైవేపై ఆ విమానం కూలిపోయింది. (Plane Crash) మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
వాషింగ్టన్: విమానం ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించాడు. అయితే హైవేపై ఆ విమానం కూలిపోయింది. (Plane Crash) మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం బొంబార్డియర్ ఛాలెంజర్ 600 బిజినెస్ జెట్ విమానం ఐదు మందితో ఒహియో స్టేట్ యూనివర్శిటీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. రెండు గంటల ప్రయాణం తర్వాత ఆ చిన్న విమానంలోని రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఫ్లోరిడాలోని నేపుల్స్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలట్ అభ్యర్థించాడు.
కాగా, ఇంజిన్ల ఫెయిల్‌తో అదుపుతప్పిన ఆ విమానం ఫ్లోరిడా హైవేపై కూలిపోయింది. ఎగసిన మంటల్లో అది కాలిపోయింది. రెస్క్యూ, ఫైర్ కంట్రోల్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేశాయి. విమానంలో ప్రయాణించిన ఐదుగురిలో ఇద్దరు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి. విమానం కూలిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Naples, Florida – 2 Dead & more injured as a plane crash-landed on a motorway. I’m not a pilot, but it seems selfish to land on a motorway and risk killing others 🇺🇸🛬 pic.twitter.com/b8cyYkeChZ
— 🇬🇧RonEnglish🇬🇧🏴 (@RonEng1ish) February 10, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

