వాషింగ్టన్, జూన్ 7: ఇండ్లల్లో వినియోగించే క్లీనర్స్ వాసన పీల్చే ‘డస్టింగ్ చాలెంజ్’ పలువురి ప్రాణాలు తీస్తున్నది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం అమెరికాలో ఈ డస్టింగ్ చాలెంజ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
అమెరికాలో 19 ఏండ్ల యువతి రెన్నా రూర్కీ ప్రాణాలు కోల్పోయింది. కీ బోర్డు క్లీనర్ వాసన పీల్చిన రూర్కీ కార్డియాక్ అరెస్టుకు గురైంది. తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన దవాఖానకు తరలించారు. ఐసీయూలో నాలుగు రోజులు చికిత్స చేసినప్పటికీ..ఆమె ప్రాణాలు నిలువలేదు.