Food Waste Index | నైరోబి, మార్చి 27: ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకోగా, మరోవైపు ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అయ్యిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొన్నది. 2024 ఏడాది ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్’ నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. 2030 నాటికి ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించే లక్ష్యంతో ఆయాల దేశాల పురోగతిని ఐరాస ట్రాక్ చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథాపై పరిశోధకుల విశ్లేషణలు, అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.