Josh Tongue : స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ (Josh Tongue) రెచ్చిపోయాడు. రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్లను వణికించిన అతడు కేవలం 22 బంతుల్లోనే 7 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ టంగ్ నిప్పులు చెరగడంతో పాక్ ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇంకేముంది.. ఇన్నింగ్స్ 103 రన్స్‌తో ఇంగ్లండ్ హెడింగ్లే టెస్టులో జయభేరి మోగించింది.
ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ సొంతగడ్డపై చెలరేగాడు. హెడింగ్లే టెస్టులో పాకిస్థాన్‌పై ప్రతాపం చూపించిన ఈ కుర్రాడు 22 బంతుల్లో ఏడు వికెట్లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే 5 వికెట్లు తీసిన టంగ్.. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు.
Across the end of Pakistan’s first innings and his first two overs in Pakistan’s second innings, Josh Tongue took 7 wickets in 22 balls 🔥 pic.twitter.com/oVehFGHlKd
— Cricinfo (@cricinfo) August 21, 2026
Pakistan Bundle out for 135 in 2nd Innings
Lost 1st Test against England innings and 103 runs.
Ollie Robinson and Josh Tongue both took 8w in Match#ENGvPAK pic.twitter.com/cKSFvRsVSy— Sports Wonderful World (@RathwaKevin) August 21, 2026
తొలుత సాద్ షకీల్(14)ను, ఆపై షాన్ మసూద్(29)ను ఔట్ చేసి అతడు పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు. అనంతరం సల్మాన్ అఘా(4)ను వెనక్కి పంపాడు టంగ్. మరో ఎండ్‌లో జోఫ్రా ఆర్చర్(3-50) మూడు వికెట్లు తీయగా పాకిస్థాన్ 135 పరుగులకే కుప్పకూలింది. దాంతో, రెండు టెస్టుల సిరీస్‌లో జో రూట్ సేన 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
A thrashing to start the post-Bazball era!
Scorecard: https://t.co/GigUUeAv2j pic.twitter.com/RUIpdE8vut
— Cricinfo (@cricinfo) August 21, 2026