Team India : గాలే టెస్టులో విజయంతో జోరుమీదున్న భారత జట్టు సిరీస్ లక్ష్యంగా పెట్టుకుంది. కొలంబోలో ఆగస్టు 23 నుంచి మొదలయ్యే రెండు టెస్టుకు పక్కాగా సిద్ధమవుతోంది టీమిండియా. శ్రీలంక స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత ఆటగాళ్లు నెట్స్‌లో సాధన చేశారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎడమ చేతివాటం స్పిన్నర్ల బంతులను ఎదుర్కొన్నాడు.
కొలంబో టెస్టుకు మరొక్క రోజే ఉంది. తొలి పోరులో 165 పరుగులతో గెలుపొందిన భారత జట్టు.. ఇక్కడా విజయమే లక్ష్యంగా ఆడనుంది. అయితే.. దెబ్బతిన్న సింహంలా ఉన్న లంకను మరోసారి నిలువరించేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది టీమిండియా. గాలేలో రెండు ఇన్నింగ్స్‌ల్లో 16, 8 పరుగులతో విఫలమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రధానంగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించుకున్నాడు.
🔥 #ShubmanGill means business in Colombo!
The India captain puts on a show in the nets, smashing massive sixes against spin ahead of the second Test against Sri Lanka. 💥🏏
Watch exclusive visuals from Team India’s practice session. 🇮🇳
FULL VIDEO: https://t.co/W8GnmxJklF pic.twitter.com/Zb6DdzpDBz
— TOI Sports (@toisports) August 21, 2026
లంక స్పిన్నర్ ప్రభాత జయసూర్య ఓవర్లో రెండుసార్లు ఔటైన గిల్.. శుక్రవారం నెట్స్‌లో స్పిన్నర్లను ఆడుతూ కొలంబో టెస్టు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే.. ఓపెనర్ కేఎల్ రాహుల్, మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ మాత్రం నెట్స్ సెషన్లో కనిపించలేదు. దాంతో.. కొలంబో టెస్టుకు కుల్దీప్ను నిజంగానే పక్కన పెట్టేస్తారా?.. సరాన్ష్ జైన్‌కు డెబ్యూట్ క్యాప్ అందిస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది.