సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 13:55:09

ఉగ్రవాదులతో ఆప్ఘన్‌ సైనికుల భీకర పోరు

ఉగ్రవాదులతో ఆప్ఘన్‌ సైనికుల భీకర పోరు

జలాలాబాద్‌ : ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌ నంగర్‌హార్ జైలులో ఆఫ్ఘన్ దళాలు, ఉగ్రవాదులకు మధ్య 18 గంటలపాటు జరిగిన భీకర పోరులో 29 మంది మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. జైలును ఆప్ఘన్‌ దళాలు పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఫవాద్ అమన్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి జలాలాబాద్‌ జైలులోకి ఉగ్రవాదులు చొరబడి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

దీంతో ఆప్ఘన్‌ భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరగ్గా 29 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఖైదీలతోపాటు పౌరులు, జైలు గార్డులు, ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు నంగహార్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి ఖోగ్యాని తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ప్రకటించింది. ప్రావిన్షియల్ రాజధాని జలాలాబాద్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వచ్చిన వ్యక్తి జైలు ప్రవేశ ద్వారం వద్ద తనను తాను పేల్చుకున్నాడు. 


logo