Congo | కాంగోలో కుంభవృష్టి.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) భారీ వర్షాలు విరుచుకుపడ్డాయి. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాల్ పట్టణంలోని కాంగో నదీ (Congo River) తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాల (Torrential rains) ధాటికి ఒక్కాసారిగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
కిన్షాసా: మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) భారీ వర్షాలు విరుచుకుపడ్డాయి. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాల్ పట్టణంలోని కాంగో నదీ (Congo River) తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాల (Torrential rains) ధాటికి ఒక్కాసారిగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. కొండ కింది ప్రాంతాల్లో ఉన్న ఇండ్లపై మట్టిపెళ్లలు, బండరాళ్లు పడటంతో 17 మంది దుర్మరణం చెందారు. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
కుంభవృష్టి కురవడంతో భారీగా నష్టం వాటిళ్లిందని మంగల గవర్నర్ సీజర్ లింబయా మంగిసా (Gov. Cesar Limbaya Mbangisa) తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రావిన్స్ అంతటా మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

