బ్యాంకాక్, సెప్టెంబర్ 24: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో వజీరా హాస్పిటల్ ఎదురుగా నాలుగు రోడ్ల కూడలి ప్రాంతం ఆకస్మాత్తుగా భూమిలోకి కుంగిపోయి అతి భారీ గుంత (సింక్ హోల్) ఏర్పడింది. బుధవారం ఉదయం ఏడు గంటలకు అందరూ చూస్తుండగానే నాలుగురోడ్ల కూడలి ఆకస్మాత్తుగా కుంగిపోయి 50 మీటర్ల వెడల్పు, 160 అడుగుల లోతులో భారీ గొయ్యి ఏర్పడింది.
భూమి కుంగిపోవండతో వాహనాలు ఆ గోతిలో పడిపోయాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మూడు వాహనాలు గోతిలో పడ్డాయని అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. పైపులు ధ్వంసమయ్యాయి. మొత్తం ఆ పరిసరాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సమీపంలోని దవాఖానలో రెండు రోజుల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.