మెక్సికో : ఉత్తర మెక్సికో సరిహద్దు రాష్ర్టం సోనోరాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. గని కార్మికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా నోచే బ్యూనా గనికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులంతా మెక్సికోకు చెందిన వారే. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..