Google Play Store | కాలిఫోర్నియా: గూగుల్ నిబంధనలను అతిక్రమించిన 14.3 లక్షల యాప్‌లను గత ఏడాది ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే 1.73 లక్షల హానికరమైన డెవలపర్స్‌ను, ఫ్రాడ్ రింగ్స్‌ను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. మోసపూరిత, దుర్వినియోగమయ్యే రూ.200 కోట్లకు పైగా లావాదేవీలను నిరోధించినట్టు గూగుల్ తన సెక్యూరిటీ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
ప్లే స్టోర్ ఎకో సిస్టమ్‌లో చేరాలనుకునే డెవలపర్స్ కొత్తగా ఈమెయిల్, ఫోన్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని నిర్దేశించింది. ప్లే స్టోర్‌లో హానికరమైన యాడ్స్‌ను నిరోధించేందుకు యాడ్స్ పాలసీని అప్డేట్ చేసినట్టు తెలిపింది.