World’s Strongest Girl | ఆ బాలిక వయసు 12 ఏళ్లు మాత్రమే. కానీ.. తన బాక్సింగ్ స్కిల్స్ గురించి తెలిస్తే మాత్రం వావ్ అనాల్సిందే. అందుకే తనకు ప్రపంచంలోనే అత్యంత బలమైన అమ్మాయిగా రికార్డుకెక్కింది. రష్యాకు చెందిన ఎన్వికా సావకాస్ గురించే మనం మాట్లాడుకునేది. తను ఎంత స్ట్రాంగ్ అంటే తన బాక్సింగ్ స్కిల్స్‌తో చెట్టునే నేలమట్టం చేయగలదు. అంతటి బలం తన సొంతం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో తన బాక్సింగ్‌తో ఎన్వికా చెట్టును కూలిపోయేలా చేసిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి నోరెళ్లబెడుతున్నారు. 12 ఏళ్లు లేవు.. ఇంత బలమా. ఎలా సాధ్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
తనకు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే బాక్సింగ్ మీద ఆసక్తి కలిగిందట. అప్పట్లో ఒక్క నిమిషంలో 100 బాక్సింగ్ పంచ్‌లు చేసింది. ఆ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత ఎన్వికాకు తన తండ్రే బాక్సింగ్‌లో ట్రెయినింగ్ ఇస్తున్నాడు. తను బాక్సింగ్‌లో ప్రొఫెషనల్ కోచ్.