వాషింగ్టన్: అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. కొలంబియాలోని దక్షిణ కరోలినా (South Carolina) ఉన్న ఓ షాపింగ్ మాల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 12 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం షాపింగ్ మాల్‌లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని చెప్పారు. ఆయుధులు కలిగిన ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
కాల్పుల్లో గాయపడిన వారిని దవాఖానకు తరలించామని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. బాధితులంతా 15 నుంచి 73 ఏండ్ల మధ్య వయస్సులని తెలిపారు. పథకం ప్రకారమే కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. కాగా, గతవారం న్యూయార్క్‌లోని ఓ స్కూల్ వెలుపల జరిగిన కాల్పుల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. కాల్పుల్లో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.