Hindu Temple: పాకిస్తాన్లో మదరస కోసం.. 100 ఏళ్ల క్రితం నాటి ఆలయం ధ్వంసం
Hindu Temple: పాకిస్థాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్సులో ఉన్న ఓ వందేళ్ల క్రితం నాటి ఆలయాన్ని ధ్వంసం చేశారు. గత నెలలో జరిగిన ఆ ఘటన గురించి ఓ నివేదిక విడుదలైంది. సమీపంలో ఉన్న మదరస నిర్మాణం కోసం ఆలయాన్ని కూల్చినట్లు చెబుతున్నారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్సులో ఉన్న ఓ వందేళ్ల క్రితం నాటి ఆలయాన్ని(Hindu Temple) ధ్వంసం చేశారు. గత నెలలో జరిగిన ఆ ఘటన గురించి ఓ నివేదిక విడుదలైంది. అయితే సమీపంలో ఉన్న మదరస నిర్మాణం కోసం ఆలయాన్ని కూల్చినట్లు చెబుతున్నారు. 125 ఏళ క్రితం నాటి ఆ ఆలయాన్ని మళ్లీ నిర్మించాలని స్థానిక ప్రజలు, మైనార్టీ సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆలయం సమీపంలో జరిగిన ఆక్రమణలను తొలగించాలని వారంతా ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కోరారు.
నిషేధిత తెహ్రీక్ ఇ లబ్బాయిక్ పాకిస్థాన్ గ్రూపు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 21వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఆ వందేళ్ల నాటి ఆలయం కూలినట్లు ప్రభుత్వం చెప్పింది. నోరోవాల్లోని సిరాజ్ గ్రామంలో దాదాపు వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆ ఆలయం ఉన్నది. ఇది లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
హిందూ ఆలయాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం మరియం నవాజ్ షరీఫ్‌ను పాకిస్థాన్ మసిహ మిలిటా పార్టీ కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

