మోసుల్: ఓ చిన్న తప్పిదం 100 మంది ప్రాణాలను బలితీసింది. పెండ్లి వేడుకలో కొందరు ఆడుతూ పాడుతూ గడుపుతుండగా.. మరికొందరు పటాకులను కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పటాకులే 100 మంది మరణించడానికి కారణమయ్యాయి.
ఈ విషాద ఘటన ఇరాక్‌లో చోటుచేసుకున్నది. నీనెవెహ్ రాష్ట్రంలోని హమ్దానియాలో ఓ పెండ్లి జరుగుతుండగా కొందరు పటాకులను కాల్చారు. దీంతో అక్కడున్న ప్లాస్టిక్ వస్తువులకు మంటలు అంటుకొని మండపమంతా వ్యాపించాయి. ప్లాస్టిక్ సీలింగ్ ఊడిపడింది. అగ్నికీలల ధాటికి 100 మంది మరణించారు. దాదాపు 150 మంది గాయపడ్డారు.