Nepal Floods: 100 మంది చైనా దేశస్థులు మిస్సింగ్.. 270కి చేరిన మృతుల సంఖ్య
Nepal Floods: నేపాల్ వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 270కి చేరుకున్నది. నేపాలీ పోలీసులు తాజాగా తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరో వైపు 100 మంది చైనా దేశస్థులు గల్లంతు అయినట్లు ఆ దేశం పేర్కొన్నది. నేపాల్‌లో మొత్తం 800పైగా మిస్సయ్యారు.
కాట్మాండు: నేపాల్‌లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరద(Nepal Floods)ల్లో 100 మంది చైనా దేశస్థులు గల్లంతు అయినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. నేపాల్‌తో నిత్యం కమ్యూనికేట్ చేస్తున్నామని లిన్ పేర్కొన్నారు. జాయింట్ రెస్క్యూ ఆపరేషన్ కోసం నేపాల్‌కు సహకరిస్తున్నట్లు చైనా పేర్కొన్నది. నేపాల్ అవసరాలకు తగినట్లు ఎమర్జెన్సీ సహాయాన్ని అందించనున్నట్లు చైనా వెల్లడించింది. టిబెట్‌లోని గిరాంగ్ కౌంటీలో కొండచరియలు విరిగిపడడం వల్ల చోటుచేసుకున్న వరదల్లో మిస్సైన వారి సంఖ్య 558గా ఉన్నట్లు చైనా టీవీ పేర్కొన్నది. దీంట్లో 260 మంది విదేశీ వ్యక్తులు ఉన్నారు. వీరికి తోడు నేపాల్‌లో మరో 826 మంది గల్లంతు అయినట్లు అధికారులు చెప్పారు.
ఇక నేపాల్ వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 270కి చేరుకున్నది. నేపాలీ పోలీసులు తాజాగా తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. బురద వరద బీభత్సం సృష్టించిన ప్రాంతాల నుంచి 270 మంది మృతదేహాలను రికవరీ చేసినట్లు నేపాలీ పోలీసులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

