Iraq | ఇరాక్‌లో ఎంపీ బంధువులపై బాంబుదాడి.. పది మంది మృతి
ఇరాక్‌లోని (Iraq) దియాలా ప్రావిన్స్‌లో బాంబు దాడి జరిగింది. అమ్రానియాలో స్థానిక ఎంపీ బంధువులపై జరిగిన బాంబుదాడిలో (Bomb Attack) పది మంది మృతిచెందారు.
బాగ్దాద్: ఇరాక్‌లోని (Iraq) దియాలా ప్రావిన్స్‌లో బాంబు దాడి జరిగింది. అమ్రానియాలో స్థానిక ఎంపీ బంధువులపై జరిగిన బాంబుదాడిలో (Bomb Attack) పది మంది మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి వారు ప్రయాణిస్తున్న వాహనం అమ్రానియా (Amraniyah) పట్టణానికి చేరుకోగానే కొందరు దుండగులు నాటుబాంబులతో దాడిచేశారు. అనంతరం తుపాకులతో కాల్పులు జరిపారు.
దీంతో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ (Curfew) విధించామన్నారు. దాడికి గల కారణాలు, ఎవరు చేశారనే విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Amraniyah
- Attack
- Bomb Attack
- Curfew
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

