జూబ్లీహిల్స్,అక్టోబర్14: యూసుఫ్‌గూడ డివిజన్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి.
వెంకటగిరి నుంచి కృష్ణానగర్, ఎల్ఎన్ నగర్ వరకు నాలాలపై ఆక్రమణలు పెద్ద ఎత్తున పెరిగి పూడికతీత కష్టసాధ్యంగా మారిపోయింది. కృష్ణానగర్‌తో పాటు లక్ష్మీనరసింహనగర్‌లో కూడా వరద ముంపు సమస్యలు తీవ్రమవుతున్నాయి.