హైదరాబాద్ : మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధరాత్రి 2 గంటల సమయంలో వివేక్ అనే యువకుడు రఘుపతి అనే యువకుడు పై కత్తితో మెడపై దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రఘుపతిని స్థానికులు చూసి వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.
అర్ధరాత్రి సమయంలో రఘుపతికి వివేక్ ఫోన్ చేసి పిలిచి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. పాత కక్షలు కారణంగానే ఈ దాడులకు పాల్పడినట్టుగా సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నరు.