కుత్బుల్లాపూర్, నవంబర్ 21 : పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట్ జిల్లా మద్దూర్ మండలం రేబర్తికి చెందిన కుంటే నిరోష(32) కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మానగర్ ఫేస్-2లో తన సోదరుడు నరేశ్‌తో కలిసి నివాసం ఉంటున్నది.
కాగా నిరోష సికింద్రాబాద్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాం కులో ఉద్యోగం చేస్తున్నది. కాగా.. పెళ్లికావడం లేదని గత కొంతకాలంగా మనస్తాపం చెందిన ఆమె గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.