ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని అరగంట ముందే భద్రతా సిబ్బంది క్లియర్ చేసేందుకు హడావుడి చేస్తుంటారు. కానీ, సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తుండగా.. ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు.
అక్కడ భద్రతను పర్యవేక్షించే సిబ్బంది చూసి కూడా పట్టించుకోలేదు. సోయి లేక పడిపోయి ఉన్న ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించాల్సింది పోయి.. అడ్డుగా గార్బేజ్ సక్కర్ను పెట్టారు. అక్కడే ఉండి పరిస్థితిని గమనించిన ‘నమస్తే తెలంగాణ’ ఫొటోగ్రాఫర్ తన కెమెరాతో ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించాడు.