Viral Video | బైక్‌పై వెళ్తుండగా.. హెల్మెట్‌తో కొట్టి అత్తను చంపిన అల్లుడు.. హైదరాబాద్‌లో దారుణం
Viral Video | భార్య మీద కోపంతో ఓ వ్యక్తి అత్తను చంపేశాడు. బైక్‌పై వెళ్తుండగా హెల్మె్ట్తో తలపై కొట్టడంతో కిందపడి తీవ్రగాయాలపై అత్త మరణించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఫిట్స్ వచ్చి కిందపడటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
Viral Video | భార్య మీద కోపంతో ఓ వ్యక్తి అత్తను చంపేశాడు. బైక్‌పై వెళ్తుండగా హెల్మె్ట్తో తలపై కొట్టడంతో కిందపడి తీవ్రగాయాలపై అత్త మరణించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఫిట్స్ వచ్చి కిందపడటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ భార్యకు అనుమానం వచ్చి అక్కడి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ (39)కి ఇద్దరు కూతుళ్లు. చిన్న కుమార్తె కావ్య(19) గత ఏడాది కరీంనగర్ చందన్‌పూర్‌కు చెందిన కర్రు స్నేహిత్ (28)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొద్దిరోజులుగా వారికి మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే గత నెల 29వ తేదీన రాత్రి అరుణకు స్నేహిత్ ఫోన్ చేశాడు. ‘నేను పెద్ద కంపెనీలో ఆఫీసర్‌ను. బాసాన్లు తోముకునే నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నా.. కానీ నీ కూతురు చిన్న విషయాలకే అలుగుతుంది‘ అని కోప్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ మరుసటి రోజు మధ్యాహ్నం అరుణ దుకాణానికి వెళ్లి వస్తుండగా స్నేహిత్ ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొద్దిసేపటికే కావ్యకు కాల్ చేసి.. అత్తమ్మ ఫిట్స్‌తో బండిపై నుంచి కిందపడిపోయింది. బలమైన దెబ్బలు తగలడంతో ఆస్పత్రికి తరలించానని చెప్పాడు. భర్త మాటలతో కంగారుపడిన కావ్య.. వెంటనే ఆస్పత్రికి చేరుకుంది. అదే రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరుణ మరణించింది.
సీసీటీవీ ఫుటేజ్
అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు
హైదరాబాద్ – కావ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కరీంనగర్‌కు చెందిన స్నేహిత్(28) అనే యువకుడు
ఏప్రిల్ 29వ తేదీన కావ్య తల్లి అరుణ(39)ను బండిపై తీసుకెళ్తూ హెల్మెట్‌తో కొట్టిన స్నేహిత్
దీంతో బండిపై నుండి పడి తీవ్ర… pic.twitter.com/SEpZHLc39S
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2026
అయితే అసలు ఏమైందని స్నేహిత్‌ను నిలదీసినప్పుడు అతని ప్రవర్తనలో తేడా ఉండటాన్ని కావ్య గమనించింది. దీంతో ఘటన జరిగిన చెంగిచర్ల ఆర్టీసీ కాలనీలోని హనుమాన్ ఆలయ సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించింది. అందులో అరుణతో స్నేహిత్ గొడవపడి హెల్మెట్‌తో బలంగా కొట్టడం.. ఆ దెబ్బకు బైక్‌పై నుంచి ఆమె కిందపడినట్లు స్పష్టంగా రికార్డయ్యింది. ఇదిలా ఉంటే దీంతో తన తల్లి మృతికి భర్తే కారణమని కావ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

