కుత్బుల్లాపూర్,జూలై : ట్రైనింగ్ నిమిత్తం బైక్పై వెళ్తున్న యువకుడిని.. ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
పోలీసుల వివరాల ప్రకారం .. దుండిగల్ ప్రాంతానికి చెందిన జమలాపూర్ మనోహర్ (22) సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ట్రైనింగ్ నిమిత్తం శనివారం ఉదయం దూలపల్లి నుంచి కొంపల్లి రోడ్డులో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. మార్గమధ్యలో అశోక్ లే లాండ్ సర్వీస్ సెంటర్ ఎదురుగా కొంపల్లి నుంచి దూలపల్లి వైపునకు వస్తున్న ప్రైవేటు బస్సు .. బైక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో మనోహర్ తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.