కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 8: బైక్‌పై రాంగ్రూట్లో వెళ్లి.. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన కుర్వ సాయితేజ(22) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ.. కేపీహెచ్‌బీకాలనీ అడ్డగుట్టలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం అతడు హాస్టల్లో ఉంటున్న హరిప్రసాద్‌తో కలిసి బైక్‌పై మెయిన్ రోడ్డుపై బయలుదేరాడు.
జాతీయ రహదారి పక్కన ఉన్న మెహఫిల్ హోటల్ వైపు రాంగ్రూట్లో బైక్‌పై వెళ్తూ.. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టాడు. ద్విచక్రవాహనం నడుపుతున్న సాయితేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. బైక్‌పై వెనుక కూర్చున్న హరిప్రసాద్ చేతులు విరిగిపోయాయి. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయితేజ హెల్మెట్ ధరించలేదని, రాంగ్రూట్లో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సాయితేజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.