బంజారాహిల్స్, సెప్టెంబర్ 28: ‘జీవితంలో చాలా తప్పులు చేశాను.. ఇలాంటి తప్పులు మళ్లీ చేయకుండా ఉండాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గం..’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువకుడు ఆత్యహత్యకు పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన ఓ యువతి సీరియళ్లలో నటిస్తూ జూబ్లీహిల్స్‌లోని ప్రశాంత్‌నగర్‌లో బంధువుల ఫ్లాట్‌లో ఉంటోంది.
ఆమెకు ఫిబ్రవరిలో సవాయ్ సింగ్(30) అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో జూలైలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈనెల 26న ఫ్లాట్‌లో ఉండే భార్యాభర్తలు ఫంక్షన్ కోసం పంజాబ్‌కు వెళ్లగా మరుసటిరోజు ఉదయాన్నే సవాయ్ సింగ్ యువతి ఫ్లాట్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు. ఉదయం 11గంటల సమయంలో యువతి ఆఫీస్‌కు వెళ్లగా తాను కూడా ఆఫీసుకు వెళ్తున్నానంటూ సవాయ్ సింగ్ బయటకు వెళ్లిపోయాడు.
కాగా సాయంత్రం ఫ్లాట్‌కు వచ్చిన యువతి లోనికి వెళ్లిచూడగా డైనింగ్ హాల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సవాయ్సింగ్ కనిపించాడు. దీంతోషాక్కు గురైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా ఉదయం బయటకు వెళ్లిన సవాయ్సింగ్ కాసేపటికి తిరిగి వచ్చి వెనకడోర్ నుంచి ఫ్లాట్‌లోకి ప్రవేశించి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తేలింది.
కాగా చనిపోయేందుకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో సవాయ్సింగ్ వీడియో పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాను జీవితంలో అనేక తప్పులు చేశానని, మళ్లీమళ్లీ అలాంటి తప్పులు చేస్తూ జీవితం గడపలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.