హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం నార్సింగీ సమీపంలోని ఖానాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బాధితురాలిని దవాఖానకు తరలించారు.
బాధితులను జస్వంత్, భూమికగా గుర్తించారు. ఇద్దరూ వైద్యులని, కామినేని దవాఖానలో హౌస్ సర్జన్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. జన్వాడలో ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. భూమికది ఎల్బీ నగర్ అని, జస్వంత్ బాచుపల్లికి చెందినవారని వెల్లడించారు. ప్రస్తుతం భూమిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.