KTR | తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్నిఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారని తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని యాదిరెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ఈ సందర్భంగా గొంతు సమస్యతో బాధపడుతున్న యాదిరెడ్డి తమ్ముడు ఓం రెడ్డి కూతురు భవిష్య(9) సర్జరీకి అయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు.
భవిష్యకు దగ్గరుండి ఆపరేషన్ చేయించాలని పార్టీ నేతలను కేటీఆర్ ఆదేశించారు. కాగా కేటీఆర్ అండతో కూకట్పల్లిలోని రాహుల్ ఈఎన్టీ ఆసుపత్రిలో భవిష్య ఆపరేషన్ విజయవంతమైంది. భవిష్యను రేపు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
తెలంగాణ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ అండ
గొంతు సమస్యతో బాధపడుతున్న యాదిరెడ్డి తమ్ముడు ఓం రెడ్డి కూతురు భవిష్య(9) సర్జరీకి అయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్
చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలోని యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన… pic.twitter.com/7kt1WEdHk9
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2026