
ఘట్కేసర్, డిసెంబర్ 20 : సీఎం కేసీఆర్ సారథ్యంలో పున:నిర్మించిన యాదాద్రి ఆలయం ప్రపంచంలోనే దివ్య క్షేత్రంగా వెలుగొందనుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.సోమవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన మైసమ్మ గుట్ట ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరై మాట్లాడారు. నియోజక వర్గంలో 17 ఆలయాలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ గుర్తించిందని తెలిపారు. ఈ ఆలయాలకు కమిటీలు వేసి బ్యాంకులలో ఖాతాలు తెరువాలని సూచించారు. ఘట్కేసర్ మైసమ్మ గుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి కోటి రూపాయల మంజూరుకు కృషి చేస్తున్నామని , మరో కోటి రూపాయలు దాతలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. అంతకు ముందు ఆలయ కమిటీ చైర్మన్ ఎం.చిత్తారి యాదవ్ ఆధ్వర్యంలో డైరెక్టర్లు బి.జంగారెడ్డి,ఎస్.శ్రీనివాస్ గౌడ్, కె.పద్మారెడ్డి, బి.సరోజ, డి.లలిత, ఎ.మైసయ్యను ఆలయ ఈఓ భాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మేయర్ వెంకట్‌రెడ్డి, పోచారం చైర్మన్ బి.కొండల్‌రెడ్డి, ఎంపీపీ వై.సుదర్శన్‌రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్లు రెడ్యానాయక్, మాధవ రెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, కౌన్సిలర్లు, ఘట్కేసర్ రైతు సొసైటీ చైర్మన్ ఎస్.రాంరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీల అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, దయాకర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.