సికింద్రాబాద్, జూన్9: మారుతి వ్యాయామశాలలో వ్యాయామం చేస్తూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో జరిగిన కుస్తీ పోటీల్లో పాల్గొని గెలుపొందిన పవన్ కుమార్, గణేశ్‌లను పలువురు ఘనంగా సన్మానించారు. సోమవారం మైలార్గడ్డలోని మారుతి వ్యాయామశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మైలార్‌గడ్డ మారుతి వ్యాయామశాలలో వ్యాయామం చేస్తూ ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నట్టు సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా మారుతి వ్యాయామశాల సభ్యుడు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. మైలార్గడ్డలోని మారుతి వ్యాయామశాలకు చాలా చరిత్ర ఉందని అన్నారు. ఈ వ్యాయామశాల 1946 లో ప్రారంభమైందని, వ్యాయామశాలలో ఎంతో మంది వ్యాయామం చేసి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీలలో మెడల్స్ సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొదటి వ్యాయామ శాలలో సోమవారం జరిగిన కుస్తీ పోటీలలో పవన్ కుమార్, గణేశ్‌లు పాల్గొన్నారు. మైలార్ గడ్డ ప్రాంతంలో నివసించే వీరు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.