హైదరాబాద్: రాజధానిలో మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద 3 కిలోల ఎఫెడ్రిన్ సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లను సాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.60 లక్షలు ఉంటుందని చెప్పారు. రెండు ప్యాకెట్లలో డ్రగ్స్ పొడిరూపంలో ఉన్నాయని చెప్పారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదుచేశారు.
రెండు వారాల క్రితం రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితుల నుంచి 1250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మత్తుమందును అమ్ముతున్నారని వెల్లడించారు.