విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి
పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పతకాలు సాధించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అన్నారు. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి శుక్రవారం కమిషనరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సీపీ పతకాలు అందజేశారు.
- సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి
సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పతకాలు సాధించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అన్నారు. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి శుక్రవారం కమిషనరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సీపీ పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ అవినాశ్ మహంతి మాట్లాడుతూ.. సేవా పతకాలను అందుకున్న సిబ్బందిని అభినందించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పతకాలను అందజేస్తాయని, అందులో భాగంగానే 2023 సంవత్సరానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 75 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసినట్టు తెలిపారు.
వీరిలో ముగ్గురికి మహోన్నత సేవా పతకాలు, 18 మందికి ఉత్తమ సేవా పతకాలు, 54 మందికి సేవా పతకాలు లభించినట్లు సీపీ వివరించారు. ఈ పతకాలు అందుకున్న వారిలో కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు ఉన్నట్లు తెలిపారు. పతకాలు అందుకోవడం వల్ల సిబ్బందిలో ఉత్సాహం, పనితనంలో పోటీతత్వం పెరుగుతుందన్నారు. ఇతర సిబ్బంది కూడా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయెల్ డేవిస్, క్రైమ్ డీసీపీ కె. నరసింహ, ఆర్థిక నేర విభాగం డీసీపీ కె. ప్రసాద్, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం, ఎస్బీ డీసీపీ సాయిశ్రీ, రోడ్ సేఫ్టీ డీసీపీ ఎల్సీ నాయక్, ఎస్ఓటీ డీసీపీ డి. శ్రీనివాస్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ జెఎస్కె. షమీర్తో పాటు ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

