మాకు రైతు భరోసా ఇవ్వరా?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. వ్యవసాయం సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నేరవేర్చడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
- ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతుల ఆవేదన
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చింది రూ. 6 కోట్లే
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది రైతుబంధు రూ. 33 కోట్లు
మేడ్చల్, మార్చి31(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. వ్యవసాయం సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నేరవేర్చడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న గ్రామాలలో రైతులు లేరా తమకు ఎందుకు రైతు భరోసా ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.6 కోట్లు మాత్రమే రైతు భరోసా ద్వారానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధును రూ. 33 కోట్లు జమ చేశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. రైతులకు ఇచ్చిన ఏ కొక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతుల బతుకులను ఆగం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతు భరోసా ఇచ్చిందేకు గుర్తించిందే తక్కువ ఎకరాలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో రైతు భరోసా ఇచ్చేందుకు గుర్తించింది 14,300 ఎకరాలకే ఇందులో అందరికి రైతు భరోసా అందలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాసంగిలో ఎకంగా 64, 700 ఎకరాలకు రైతు భరోసాను అధికారులు కట్ చేశారు.
రైతులందరికి రైతు భరోసాను అందించాలి
యాసంగిలో వ్యవసాయం సాగు చేసిన రైతులందరికీ రైతు భరోసాను అందించాలి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న గ్రామాల రైతులకు ఏ ఒక్కరికి కూడ రైతు భరోసా అందలేదు. ఔటర్ రింగురోడ్డుకు అనుకుని గ్రామాలలో వ్యవసాయం సాగు చేసేవారు రైతులు కాదా. కష్టపడి వ్యవసాయం సాగు చేసే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు.
– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

