కిడ్నీ దాతల్లో మహిళలే అధికం
సమాజంలో పెరుగుతున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్టార్ హాస్పిటల్స్.. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
- స్టార్ హాస్పిటల్లో ఘనంగా మహిళా దినోత్సవం
సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : సమాజంలో పెరుగుతున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్టార్ హాస్పిటల్స్.. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్టార్ హాస్పిటల్స్‌లోని సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టులు అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్లు డాక్టర్ గందె శ్రీధర్, డాక్టర్ జ్యోత్స్న గుత్తికొండ, డాక్టర్ జెల్లా రామశంకర్, డాక్టర్ వై. సందీప్ రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గందె శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేకమైన రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. కిడ్నీ దాతల్లో ఎకువ మంది మహిళలు (90శాతం) ఉన్నారని పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడడంలో వారిది కీలకపాత్ర అని కొనియాడారు.
కిడ్నీని దానం చేసే ఈ ఉదాత్తమైన సేవలతో కిడ్నీ గ్రహీతకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబానికి వారి ప్రియమైనవారికి కొత్త జీవితాన్ని ఇస్తున్నారని చెప్పారు. కిడ్నీ దానం అనేది ప్రాణాలను రక్షించే శక్తి అని తెలిపారు. అనంతరం డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధి సైలెంట్ కిల్లర్ అని..ఎందుకంటే ఇది ఎటువంటి లక్షణాలు లేకుండా చాలా కాలం పాటు నెమ్మదిగా పురోగమిస్తుందని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ప్రతి సంవత్సరం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుతున్నామని పేర్కొన్నారు. మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రపిండాల వ్యాధులు లేదా గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కిడ్నీ వ్యాధి ఎకువయ్యే ప్రమాదం ఉంటుందని డాక్టర్ జెల్లా రామశంకర్ చెప్పారు. అందుకని తరచుగా ఈజీఎఫ్ఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

