బంజారాహిల్స్,నవంబర్ 27: ఆభరణాల షాపులో దృష్టి మరల్చి చెవి రింగులను తస్కరించిన ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట సమీపంలోని ఓయూ కాలనీలోని సుజని జువెలర్స్ ఆభరణాల షాపులోకి ఈనెల 26న మధ్యాహ్నం ముగ్గరు మహిళలు కస్టమర్ల రూపంలో వచ్చారు. తమకు బంగారు చెవి రింగులు కావాలంటూ షాపులోని సిబ్బందిని కోరారు.
కౌంటర్లోని సేల్స్‌మెన్ చెవి రింగులు చూపిస్తున్న తరుణంలో అతడి దృష్టి మరల్చి 10గ్రాముల బంగారు చెవి కమ్మలను తస్కరించి వాటి స్థానంలో రోల్డ్‌గోల్డ్ రింగులను పెట్టారు. కాసేపటి తర్వాత తమకు డిజైన్లు నచ్చలేదంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత బంగారు రింగులను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు నిర్వాహకుడు సుధీర్ యలమంచిలి గురువారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.