హైదరాబాద్ : రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రోజురోజుకు ఆ వ్యతిరేకత పెరుగుతోంది. దాంతో జనం రేవంత్‌రెడ్డి పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా మహిళలైతే తీవ్రంగా మండిపడుతున్నారు. ముదనష్టపు రేవంత్‌రెడ్డి రెండేళ్లకే నరకం చూపిస్తున్నాడని విమర్శిస్తున్నారు. బతుకమ్మ చీరలు ఇయ్యలేదని, ఫ్రీబస్సుతో మహిళలకు గౌరవం లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రహమత్ నగర్ డివిజన్లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ఆల వెంకటేశ్వర్ రెడ్డితో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆయనకు రేవంత్‌రెడ్డి పాలనలో ఎదురవుతున్న కష్టాలను చెప్పుకున్నారు. ముదనష్టపోడు నల్లా బిల్లు రూ.40 వేలు వేశాడని ఓ మహిళ విమర్శించింది. మహిళకు ఫ్రీబస్సు పెట్టాడని, ఎన్నడన్న ఒకనాడు బస్సెక్కితే ఒంటికాలుపై నిలబడాల్సి వస్తున్నదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌ను మహిళలు తిడుతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనకే నరకం చూపిస్తున్నాడు
నల్లా బిల్లు రూ.40 వేలు వేశాడు ముదనష్టపోడు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్లో పాల్గొన్న దేవరకద్ర బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో నల్లా బిల్లు, ఫ్రీ బస్సు కష్టాలు చెప్పుకుంటున్న మహిళలు pic.twitter.com/gBaVh5A7Xe
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2025