Woman Missing | కాచిగూడ, జూన్ 6 : కొడుకు ఇంటికి వెళ్లిన తల్లి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రవికుమార్ వివరాల ప్రకారం చెప్పల్ బజార్ ప్రాంతానికి చెందిన రామ్‌చందర్ భార్య కుందన్ బాయి(80) ఈనెల 4 తేదీన పెద్ద కొడుకు ఇంటికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇప్పటికీ ఆమె పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు కలత చెంది ఇరుగుపొరుగు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చిన్న కుమారుడు సందీప్ కుమార్ శుక్రవారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంట్లోంచి వెళ్లే సమయంలో కుందన్ బాయి ఆకుపచ్చ రంగు చీర, పసుపు రంగు జాకెట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు. చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.