చర్లపల్లి, మే 29 : కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ వైద్యశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం.. కొంతం పద్మ(36) ఏఎస్రావునగర్లోని ఓ వైద్యశాలలో పనిచేస్తున్నది. శనివారం రాత్రి మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది.