కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 21 : సిటి స్కాన్ కోసం వచ్చిన మహిళకు అధిక డోస్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ టెక్నిషియన్స్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నగరంలోని ఖాజాగూడాకు చెందిన సూర్యలక్ష్మి (66) ముక్కు సమస్యతో బాధపడుతుంది. గత యేడాది మే 6న సూర్యలక్ష్మి తన ముక్కుకు సిటీ స్కాన్కోసం కేపీహెచ్‌బీ కాలనీలోని మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వచ్చింది. స్కాగింగ్ బాగా వచ్చేందుకు ల్యాబ్ టెక్నిషియన్స్ పెనమస్థ శ్రీనివాస్ ఫణిశర్మ, ఉదయగిరి సుబ్రహ్మణ్యంలు కలిసి ఆ మహిళలకు అనస్థీయా ఇంజెక్షన్ ఇచ్చారు.
సరైన జాగ్రత్తలు తీసకోకుండా అధిక డోస్‌తో ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ మహిళకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను సమీపంలోని వైద్యశాలకు తరలించగా… అప్పటికే సూర్యలక్ష్మి మరణించిందని డాక్టర్లు తెలిపారు. కాగా ఆమె కుమారుడు అభిషేక్ కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ ల్యాబ్‌లో పనిచేస్తున్న పెనమస్థ శ్రీనివాస్ ఫణిశర్మ, ఉదయగిరి సుబ్రహ్మణ్యం ల సర్టిఫికెట్లను పరిశీలించిగా వాటికి సరైన గుర్తింపు లేదని( నకిలీవని) తెలింది. మరోవైపు డీఎంహెచ్‌వోకు లేఖ రాయగా అర్హత లేకున్నా… మహిళలకు అధిక డోసు ఇంజెక్షన్ ఇచ్చి మరణానికి కారణమైనట్లు తేల్చారు. దీందో ఆ మహిళ మరణానికి కారణమైన ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్స్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.