దుండిగల్, జూన్ 4: బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సూట్ కేసులో గుర్తుతెలియని మహిళా మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ , డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ గోడను ఆనుకొని ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగ్ లో నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు.
సూట్ కేసులో సుమారు 25 నుంచి 35 ఏండ్ల మధ్య వయసున్న మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో బయటపడింది. ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.